ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆపరేషన్ ముస్కాన్... 34 మంది పిల్లలకు విముక్తి - 34 children saves as part of operation muskan

ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా గుంటూరు, పామర్రు సర్కిళ్లలో.. పోలీసులు బాల కార్మికులను గుర్తించారు. వారి తల్లితండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. పిల్లలకు మంచి విద్యాబుద్ధులు నేర్పేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

operation Muskaan at krishna district
ముస్కాన్ లో భాగంగా జిల్లాలో 34 పిల్లలకు విముక్తి

By

Published : May 20, 2021, 9:20 AM IST

కృష్ణా జిల్లా గుడివాడ, పామర్రు సర్కిళ్ల పరిధిలో నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్ లో 34 మంది పిల్లలను గుర్తించామని డీఎస్పీ సత్యానందం తెలిపారు. గుడివాడ రూరల్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో.. ఆ పిల్లలను అధికారులు మీడియాకు చూపించారు. వారి తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు.

పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పేలా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు లేని పిల్లలను చైల్డ్ కేర్ సెంటర్లకు తరలించి వారి భవిష్యత్తుకు విద్యతో బాటలు వేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ అబ్దుల్ నబీ, పామర్రు సీఐ కిషోర్ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details