విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో మూత్ర కోశవ్యాధుల శస్త్రచికిత్స విభాగం, క్యాన్సర్, ప్లాస్టిక్ సర్జరీ విభాగాలు ప్రారంభమయ్యాయి. సబ్ కలెక్టర్ ప్రవీణ్ చంద్ ఆయా విభాగాలను ప్రారంభించి పరిశీలించారు. నగరంలో ఇలాంటి అధునాతన సేవలు రావటం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగమని అన్నారు.
డయాలసిస్ కు సంబంధించి 10 పరికరాలు ఉన్నాయని, ఈ వారం నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. అన్ని తరగతుల ప్రజలకూ వైద్య సేవలు అందించటమే తమ లక్ష్యమని జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు.