ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంచికచర్ల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం - Mla Mondithoka Jaganmohan Rao

కృష్ణా జిల్లాలోని కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​రావు ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.

'కంచికచర్ల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం'
'కంచికచర్ల మార్కెట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభం'

By

Published : Nov 5, 2020, 5:48 PM IST

Updated : Nov 6, 2020, 1:20 PM IST

రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు మద్దతు ధర అందించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్​రావు అన్నారు. కంచికచర్ల వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం, మొక్కజొన్న, పత్తి కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ పనిచేస్తున్నారన్నారు.

ప్రతి గింజ కొంటాం..

పండిన ప్రతి పంటను, గింజను పారదర్శకంగా కొనుగోలు చేయడంతో పాటు రైతులు తీసుకువచ్చిన ప్రతి గింజను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ మేరకు అధికారులు నిష్పక్షపాతంగా కొనుగోలు చేయాలన్నారు.

దళారులను ఆశ్రయించొద్దు..

రైతులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు దళారులను ఆశ్రయించి తక్కువ రేటుకే పంటను విక్రయించి నష్టపోవద్దని సూచించారు.

ఇవీ చూడండి :'జగన్ లేఖ న్యాయవ్యవస్థ ఔన్నత్యాన్ని దిగజార్చుతుంది'

Last Updated : Nov 6, 2020, 1:20 PM IST

ABOUT THE AUTHOR

...view details