ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మైలవరంలో రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణం ప్రారంభం - Krishna District Mylavaram Latest News

మైలవరంలో రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణాన్ని ఉద్యాన సహాయ సంచాలకులు దయాకర్ బాబు ప్రారంభించారు. ఈ దుకాణాల ద్వారా వారికి కలిగే ప్రయోజనాలను వివరించారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.

మైలవరంలో రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణం ప్రారంభం
మైలవరంలో రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణం ప్రారంభం

By

Published : Nov 26, 2020, 6:12 PM IST

ఎఫ్​పీవోలో భాగంగా కృష్ణాజిల్లా మైలవరంలో రైతు ఉత్పత్తిదారుల ఎరువుల దుకాణాన్ని జిల్లా ఉద్యాన సహాయ సంచాలకులు దయాకర్ బాబు ప్రారంభించారు. ఈ దుకాణాల వల్ల ఉద్యానవన పంటలకు సంబంధించి ముఖ్యంగా మామిడి రైతులకు ఉపయోగకరమని తెలిపారు. తక్కువ ధరలో ఉద్యాన పంటలు పండించటానికి నాణ్యమైన పురుగుమందులు, ఎరువులను ఈ దుకాణాల ద్వారా పొంది పంట దిగుబడిని పొందవచ్చన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతు శ్రేయస్సే ధ్యేయంగా 100 ఎఫ్​ఫీఓలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దళారులను నియంత్రించి రైతులే తమ పంటకు సరైన ఆదాయాన్ని పొందడానికి ఇవీ సహకరిస్తాయన్నారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details