కరోనా లాక్డౌన్ కారణంగా రెండు నెలలుగా విజయవాడ జవహర్ ఆటో నగర్లో మూతబడిన పరిశ్రమలు వర్క్ షాపులు శుక్రవారం తెరుచుకున్నాయి. ఆటోనగర్ తెరిచేందుకు అనుమతి ఇవ్వాలంటూ పారిశ్రామిక, కార్మిక సంఘాలు పలుమార్లు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఏపీఐఐసీ చైర్పర్సన్ రోజాను కలిసి విజ్ఞప్తి చేయడంతో పరిశ్రమలు, వర్క్ షాపులు తెరిచేందుకు అనుమతిచ్చారు.
ఆటోనగర్‌లో తెరుచుకున్న పరిశ్రమలు - latest vijayawada news
లాక్డౌన్ సడలింపులతో విజయవాడ ఆటోనగర్‌లో పరిశ్రమలు, వర్క్ షాపులు శుక్రవారం తెరుచుకున్నాయి. కార్మికులు, యజమానులు, వినియోగదారులు ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చారు. భౌతిక దూరం పాటిస్తూ పనులు నిర్వహిస్తున్నారు.
ఆటో నగర్ లో తెరుచుకున్న పరిశ్రమలు
కార్మికులు, యజమానులు, వినియోగదారులు ముఖానికి మాస్కులు కట్టుకొని వచ్చారు. ఎవరు వచ్చినా శానిటైజర్‌తో చేతులు శుభ్రం చేసుకున్న తర్వాత లోపలికి అనుమతిస్తున్నారు. చిన్న పరిశ్రమలలో సగం సిబ్బందితోనే పనులు ప్రారంభించారు.
ఇది చదవండిచాట్రాయి మండలంలో తెలంగాణ మద్యం స్వాధీనం