ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 676 మంది ఈ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాగా, 9వేల 382 మంది ఉత్తీర్ణులైనట్లు మంత్రి వెల్లడించారు. ఓపెన్ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలకు 14వేల 77 మంది హాజరుకాగా, 7వేల 478 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. అనంతరం గుర్తింపు పొందిన ఉపాధ్యాయులకు గ్రీవియన్స్ యాప్ ను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సంధ్యారాణి ఇతర అధికారులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ పదోతరగతి,ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల - పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ
ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు.
ఓపెన్ ఎస్ఎస్సీ, ఇంటర్ పరీక్షల ఫలితాలు విడుదల