ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'వైకాపా మహిళా కార్యకర్తలకే వైఎస్సార్ చేయూత' - vatsavai mandal latest news

రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వైఎస్సార్ చేయూత పథకం వైకాపాకు చెందిన మహిళలకే అందుతోందని జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆరోపించారు. తెదేపా సానుభూతి పరులకు ఈ పథకం అందకుండా గ్రామ స్థాయిలో వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారన్నారు.

ex mla sriram tataiah
ex mla sriram tataiah

By

Published : Oct 5, 2020, 4:03 PM IST

అర్హులైన మహిళలందరికీ వైఎస్సార్ చేయూత పథకం వర్తింపజేయాలని కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య ఆధ్వర్యంలో వత్సవాయి మండల పరిషత్ కార్యాలయంలో ప్రజలు ఆందోళన నిర్వహించారు. కేవలం వైకాపా మహిళా కార్యకర్తలే వైఎస్సార్ చేయూత పథకం కింద లబ్ధి పొందుతున్నారని శ్రీరామ్‌ తాతయ్య ఆరోపించారు.

తెదేపా సానుభూతి పరులకు ఈ పథకం అందకుండా గ్రామ స్థాయిలో వైకాపా నాయకులు అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. కొన్ని గ్రామాల్లో మహిళలను తమ పార్టీలో చేరాలంటూ వైకాపా నాయకులు ఒత్తిడి చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ పథకాల అమలులో పక్షపాత ధోరణితో వ్యవహరించకూడదని హితవు పలికారు. అర్హులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేయకుంటే న్యాయపోరాటం చేసేందుకైనా వెనకాడబోమని శ్రీరామ్ తాతయ్య స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details