కృష్ణా జిల్లా వ్యాప్తంగా 175 షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. వాటిలో ఇప్పటికే వాచ్ మెన్‌గా పనిచేస్తూ ఐటిఐ అర్హత కలిగిన వారు సుమారు 70 మంది ఉన్నారని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ తెలిపింది. వారిని షిఫ్ట్ ఆపరేటర్లుగా నియమించాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై.. ఇప్పటికే పలుమార్లు అధికారులను సంప్రదించి వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదని యూనియన్ ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.
వాచ్ మెన్‌కు అనుకూలంగా హైకోర్టును ఇచ్చిన తీర్పులను సైతం అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదని వాపోయారు. ఖాళీగా ఉన్న స్థానాలను అధికార పార్టీ ఎమ్మెల్యేలు, అధికారులు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.ఇప్పటికైనా అధికారులు స్పందించి వాచ్ మెన్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయవాడ ధర్నా చౌక్ లో ఈ విషయమై ఆందోళన చేశారు.