ఒక్క సమాచారం (మేసేజ్)తో మీ జేబులు ఖాళీ చేస్తున్నారు సైబర్ కేటుగాళ్లు. అప్రమత్తంగా లేకుంటే నిలువుదోపిడీ చేసే కేడీలు పుట్టుకొస్తుంటారు. సైబర్ నేరగాళ్లు మనిషి బలహీనతల్ని ఆసరాగా చేసుకుని కుచ్చుటోపీ పెడుతున్నారు. మీరు పెట్టుబడి పెట్టండి 15 రోజుల్లో రెట్టింపు నగదు పొందండి... అంటూ అమాయకులకు ఎరవేసి మోసం చేస్తున్నారు.
సాఫ్డ్‌వేర్ నుంచి రూ.32లక్షలను దోచేశారు
విజయవాడలో తాజాగా ఈ తరహాలో ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నుంచి రూ.32 లక్షల నగదును దోచేశారు. ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ యువకుడు బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచే తన విధులు నిర్వహిస్తున్నాడు. మీరు ఆన్లైన్ ట్రేడింగ్‌లో పెట్టుబడి పెట్టండి అనతి కాలంలోనే మీకు రెట్టింపు వస్తుందని మెసేజ్ వచ్చింది. దీంతో సంబంధిత లింక్ ను క్లిక్ చేయగానే ఎక్సెల్ ఏసియా 8 అనే వెబ్ సైట్ తెరుచుకుమది. దాంట్లో పూర్తి వివరాలు అప్ లోడ్ చేయగానే ఖాతా ప్రారంభమవుతుందని తెలిపారు.
అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు
బాధితుడు ఆన్ లైన్లో అన్నీ వివరాలను తెలిపాడు. ఓ బ్యాంక్ ఖాతా నెంబర్ ఇచ్చి నగదు వేయాలని తెలిపారు. వెంటనే బాధితుడు ఆ ఖాతాలో నగదు వేశాడు. 15 రోజుల తర్వాత నగదును రెట్టింపు చేస్తూ వెబ్సైట్ లో చూపాడు. అది చూసి బాధితుడు నమ్మి మరోసారి నగదు చెల్లించాడు. అలా విడతల వారీగా రెండు నెలల పాటు రూ.32 లక్షలను చెల్లించాడు. నగదు కావాలని కోరగా రూ.60 లక్షలు వచ్చిన తర్వాత ఇస్తామని నిందితుడు చెప్పటంతో... అనుమానం వచ్చిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బ్యాంక్ ఖాతాల ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. హర్యానా, గుజరాత్‌కు చెందిన ఖాతాలుగా గుర్తించారు. బ్యాంక్ ఖాతాలో ఉన్న నగదును సీజ్ చేశారు.
పోలీసుల సూచనలు