కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలో వెలసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆన్లైన్ పూజా సేవలు అందుబాటులోకి తెచ్చారు. స్వామి వారికి ప్రత్యక్షముగా నిర్వహించు సేవలు, పూజలు నిలిపివేసి భక్తులకు ఆన్ లైన్ సేవలు అందిస్తున్నారు. ఈ మేరకు భక్తులు భక్తులు ఆన్ లైన్ ద్వారా సొమ్మును చెల్లించి.. పేరు, గోత్ర నామాలతో జరిపించుకోవచ్చునని ఆలయ కార్యనిర్వహణాధికారి జీవిడియన్ లీలాకుమార్ తెలిపారు.
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆన్లైన్ పూజాసేవలు - Online services of Sri Subrahmanyeshwara Swamy in Mopidevi village
కృష్ణాజిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆన్ లైన్ పూజా సేవలు అందుబాటులోకి తెచ్చారు. భక్తులు ఆన్ లైన్ ద్వారా సొమ్మును చెల్లించి.. పేరు గోత్ర నామాలతో పూజ జరిపించుకొవచ్చునని తెలిపారు.
![శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ఆన్లైన్ పూజాసేవలు Sri Subrahmanyeshwara Swamy temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-08:44:22:1621739662-ap-vja-29-22-mopidevitemple-e-hundi-online-pujalu-ap10044-22052021203331-2205f-1621695811-648.jpg)
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం
శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి విరాళములు, కానుకలు https://tms.ap.gov.in వెబ్ సైట్లో లాగిన్ అయి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవస్థానం, మోపిదేవిని ఎంచుకొని ఈ-హుండీ ద్వారా చెల్లించి రసీదు ప్రింట్ తీసుకోవచ్చునని తెలిపారు. భక్తులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని లీలాకుమార్ సూచించారు.
ఇదీ చదవండీ..'ఆనందయ్యది ఆయుర్వేదం కాదు..నాటు మందు'