అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం కృష్ణా జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా చిత్రలేఖనం పోటీలను నిర్వహించామని జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గీసిన చిత్రాలను ఆన్లైన్లో ప్రదర్శిస్తామని చెప్పారు. ఓజోన్ పొరను పరిరక్షించేందుకు విద్యార్థుల్లో చైతన్యం నింపేందుకే ఈ పోటీలు నిర్వహించామని పేర్కొన్నారు. చిత్రలేఖన పోటీల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు పంపిస్తామని హుస్సేన్ తెలియజేశారు.
రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు చిత్రలేఖనం పోటీలు - కృష్ణా జిల్లా తాజా వార్తలు
అంతర్జాతీయ ఓజోన్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆన్లైైన్లో చిత్రలేఖన పోటీలు నిర్వహించామని కృష్ణా జిల్లా సైన్స్ అధికారి హుస్సేన్ వెల్లడించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్లు జారీ చేస్తామన్నారు.
International Ozone Day