సులభతర విధానంలో అగ్నిమాపక శాఖ నుంచి ధ్రువీకరణ పత్రాల జారీకి ఆన్‌లైన్ విధానం ఉపయోగపడుతుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్ కుమార్ తెలిపారు. అగ్నిమాపక శాఖను పటిష్ఠం చేస్తున్నామని పేర్కొన్నారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్న ఆ శాఖ డైరెక్టర్ జనరల్ సత్యనారాయణ... ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటున్నామని చెప్పారు. నిర్మాణం పూర్తి కావస్తున్న అగ్నిమాపక భవనాలను త్వరలోనే హోంమంత్రిచే ప్రారంభింపజేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ఆన్‌లైన్‌తో అగ్నిమాపక శాఖలో పారదర్శకత - అగ్నిమాపకశాఖ
అగ్నిమాపక శాఖలో అవినీతి లేకుండా... పారదర్శకంగా సేవలందించేందుకు ఆన్‌లైన్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్నామని హోంశాఖ ముఖ్య కార్యదర్శి కేఆర్‌ఎం కిశోర్‌కుమార్ పేర్కొన్నారు. విజయవాడలోని రాష్ట్ర అగ్నిమాపక శాఖ డీజీ కార్యాలయంలో ఆన్‌లైన్ ఫైర్ అటెండెన్స్ సర్టిఫికేట్ వెబ్‌సైట్‌ను ఆయన ప్రారంభించారు.
హోంశాఖ ముఖ్యకార్యదర్శి