ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పనులు మానుకొని క్యూలైన్​లో నిలబడుతున్నారు..!

రాయితీ ఉల్లి కోసం కృష్ణా జిల్లా దివిసీమ పల్లె ప్రజల అవస్థలు పడుతున్నారు. 90 గ్రామాలకు ఒకటే రాయితీ ఉల్లి కేంద్రం ఉండటంతో... తెల్లవారుజాము నుంచే ప్రజలు బారులు తీరుతున్నారు. కూలీ పనులు మానుకొని మరీ ఉల్లి కోసం పాట్లు పడుతున్నారు.

onions-problems-in-diviseema-krishna-district
onions-problems-in-diviseema-krishna-district

By

Published : Dec 10, 2019, 3:23 PM IST

దివిసీమలో ఉల్లి కోసం అవస్థలు

రాయితీ ఉల్లి కోసం కృష్ణా జిల్లా దివిసీమ పల్లె ప్రజలు... కూలీ పనులు మానుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచే రాయితీ ఉల్లి కేంద్రం వద్ద బారులు తీరుతున్నారు. అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, మోపిదేవి, చల్లపల్లి, ఘంటసాల మండలాలకు చల్లపల్లిలో ఉన్న రైతు బజార్ ఒక్కటే దిక్కయింది. సూర్యోదయం కాకముందే 90 గ్రామాల ప్రజలు చల్లపల్లి రైతు బజార్ వద్దకు చేరుకుంటున్నారు. క్యూలైన్​లో గంటల తరబడి నిలబడుతూ... అవస్థలు పడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details