ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీఎంఆర్​ఎఫ్​కు గిరిజన సంక్షేమ శాఖ విరాళం రూ.1.46 కోట్లు

కరోనా నివారణ, సహాయ చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ కోటి 46 లక్షల 25 వేల 439 రూపాయలు విరాళం అందించింది. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్‌ జగన్‌ ను కలిసిన ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి, గిరిజన సంక్షేమశాఖ డైరెక్టర్‌ రంజిత్‌ బాషా, వైకాపా నేత శత్రుచర్ల పరిక్షిత్ రాజు.. విరాళానికి సంబంధించిన చెక్కును సీఎంకు అందించారు.

Ongoing donations to the Chief Minister relief fund
చెక్కును అందుకుంటున్న ముఖ్యమంత్రి జగన్

By

Published : May 13, 2020, 2:13 PM IST

కరోనా నివారణ చర్యల్లో భాగంగా ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు కొనసాగుతున్నాయి. గిరిజన సంక్షేమ శాఖ 1 కోటి 46 లక్షల 25 వేల 439 రూపాయల విరాళం అందించింది. వీటిలో డైరెక్టర్, ట్రైబల్‌ వెల్ఫేర్‌ విభాగం‌ ఉద్యోగులు 58 లక్షల 26 వేల 552 రూపాయలు... ట్రైబల్‌ వెల్ఫేర్‌ కాంట్రాక్ట్‌ టీచర్స్‌ 2 రోజుల వేతనం 32 లక్షల 78 వేల 350 రూపాయలు, ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఇంజినీరింగ్‌ డిపార్ట్‌మెంట్‌ తరఫున 3 లక్షల 42 వేల 497 రూపాయలు విరాళం ఇచ్చారు.

ట్రైబల్‌ వెల్ఫేర్‌ గురుకులం రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల తరఫున 44 లక్షల 11 వేల 834 రూపాయలు, గిరిజన కోఆపరేటివ్‌ కార్పొరేషన్‌ తరఫున 7 లక్షల 28 వేల 749 రూపాయలు, ట్రైబల్‌ కల్చరల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రైనింగ్‌ ఇన్​స్టిట్యూట్, విశాఖపట్నం తరఫున 28 వేల 919 రూపాయల విరాళం అందించారు.

తితిదే పెన్షనర్ల విరాళం

ముఖ్యమంత్రి సహాయనిధికి తితిదే పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 44 లక్షల 21 వేల 957 విరాళం అందించింది. డీడీని సీఎం వైయస్ జగన్ కు తితిదే చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి సహాయనిధికి రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. 20 లక్షల 25 వేల విరాళం ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా కడియంకు చెందిన ఆనం ఎలక్ట్రికల్ మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ 25 లక్షలు, రాజమండ్రికి చెందిన ఎన్ జె శరోన్ కుమార్, సుదన్ శరాన్ ఇతరులు రూ. 4 లక్షల75 వేలు, కృష్ణా జిల్లా కైకలూరు కు చెందిన వైకాపా నేతలు, అభిమానులు రూ. 8 లక్షల విరాళం అందించారు.

ఇదీ చూడండి:

రైతు భరోసా కేంద్రాల్లో అధునాతన మిషన్లు

ABOUT THE AUTHOR

...view details