కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థి విజయాన్ని మార్చేసింది. మండలంలోని కందలంపాడు సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు. ప్రత్యర్థి మొవ్వ సుబ్రహ్మణ్యంపై గెలుపొందారు. అతిచిన్న గ్రామం కావడంతో 203 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. వీటిలో నాగరాజుకు 102, సుబ్రహ్మణ్యంకు 101 ఓట్లు వచ్చాయి. రీకౌంటింగ్ చేసినా అదే ఫలితం రావడంతో అధికారులు నాగరాజును సర్పంచ్‌గా ప్రకటించారు.
పంచాయతీ ఫలితం: విజయాన్ని మార్చేసిన ఒక్క ఓటు - Panchyathi elections news
ఒక్క ఓటు సర్పంచ్ అభ్యర్థికి విజయాన్ని కట్టబెట్టింది. కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో కేవలం ఒక్క ఓటుతో కందలంపాడు సర్పంచ్‌గా బైరెడ్డి నాగరాజు విజయం సాధించారు.
ఒక్క ఓటు ఆధిక్యంతో గెలుపు
అదే మండలంలోని జగన్నాథపురంలో పిన్నిబోయిన శ్రీనివాసరావు మూడు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.
మరికొందరు..
- నెల్లూరు: పామూరుపల్లి సర్పంచిగా ఒక్క ఓటు ఆధిక్యంతో తెల్ల గొర్ల సుశీల విజయం సాధించారు.
- గుంటూరు: పిడపర్తిపాలెం సర్పంచిగా 1 ఓటు ఆధిక్యంతో గెలిచిన కరుణశ్రీ
- చిత్తూరు జిల్లా తిరుమలకుప్పం సర్పంచిగా 2 ఓట్ల ఆధిక్యంతో సరస విజయం
- విశాఖ: తగరంపూడి సర్పంచిగా 2 ఓట్ల ఆధిక్యంతో అప్పారావు గెలుపొందారు.
- గుంటూరు: తోట్లపాలెం సర్పంచిగా 6 ఓట్లతో వీరరాఘవయ్య గెలుపు
- గుంటూరు జిల్లా గార్లపాడు సర్పంచిగా 14 ఓట్లతో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్ గెలుపు
Last Updated : Feb 10, 2021, 4:28 AM IST