మహిళను రక్షింప బోయి బుడమేరు కాల్వలో గల్లంతైన యువకుడు.. శవమై తేలాడు. సోమవారం రాత్రి విజయవాడ మధురానగర్ బుడమేరు కాలవలో స్థానికంగా నివసించే ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. ఇది గమనించిన ముగ్గురు యువకులు కాల్వలో దూకి ఆమెను సురక్షితంగా బయటికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో ముగ్గురు యువకుల్లో ఒకరు బుడమేరులో గల్లంతు అవ్వగా అతని మృతదేహాన్ని విపత్తు నిర్వహక బృందం బయటకు తీసింది. మృతుడిని ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణ గా గుర్తించారు. మాచవరం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
మహిళను రక్షించబోయి.. తానే బలయ్యాడు...! - gent
ఆత్మహత్య చేసుకునేందుకు కాల్వలో దూకిన మహిళను కాపాడేందుకు ముగ్గురు యువకులు కాల్వలోకి దూకారు. మహిళను కాపాడారు. అందులో ఓ యువకుడు ప్రమాదవశాత్తూ నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి.. చివరికి శవంగా తేలాడు.
బుడమేరు