గన్నవరం మండలం జక్కలనెక్కలంలో విషాదం జరిగింది. బుడమేరు కాలువ వద్దకు చైతన్య, సతీష్, నాని, బాబీ అనే నలుగురు యువకులు స్నానం చేసేందుకు వెళ్లారు.
స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు సతీష్ (17) అనే యువకుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న గన్నవరం ఎస్సై పురుషోత్తం.. సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టారు.