ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు - various road accidents in ap

రాష్ట్రంలో అర్ధరాత్రి రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు.

రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు

By

Published : Jul 11, 2019, 8:37 AM IST

Updated : Jul 11, 2019, 9:44 AM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు ఆర్టీసీ బస్సుని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు ప్రారంభించారు.

కడప జిల్లా మైదుకూరు 67 వ జాతీయ రహదారి మార్గంలోని నంది పల్లె విశ్వశాంతి స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. బద్వేల్ నుంచి మైదుకూరు వైపు వెళుతున్న మృతుణ్ణి ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు
Last Updated : Jul 11, 2019, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details