తెలంగాణ రాష్ట్రం వరంగల్ గ్రామీణ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంటలోని బావిలో ఈ రోజు మరో ఐదు మృతదేహాలు లభ్యమయ్యాయి. 21వతేదీన గొర్రెకుంటలోని బావిలో 4 మృతదేహాలను కనుగొన్న పోలీసులు... నేడు మరో ఐదుగురిని వెలికి తీశారు. నిన్న వెలికితీసిన మృతుల్లో మక్సుద్, ఆయన భార్య నిషా, కుమార్తె బుస్రు, మక్సుద్ మనవడు ఉండగా... ఈ రోజు వెలికితీసిన వారిలో మరో ఇద్దరు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు.
మృతదేహాల్లో షకీల్ వరంగల్ వాసిగా... శ్రీరామ్ బిహార్ వాసిగా గుర్తించారు. 20 ఏళ్ల క్రితం బంగాల్ నుంచి వచ్చి వరంగల్‌లో స్థిరపడిన కుటుంబమని స్థానికులు తెలిపారు. లాక్డౌన్ కారణంగా రెండు నెలల నుంచి పనులు లేవని... అప్పటి నుంచి గోదాంలోనే గోనే సంచులు కుడుతున్నారని స్థానికులు పేర్కొన్నారు. మొన్న సాయంత్రం కూడా వీరు పనికి వచ్చారని... నిన్న ఉదయం నుంచి కనిపించకపోవడంతో అన్ని చోట్ల వెతకగా... బావిలో కనిపించారని తెలిపారు.