విజయవాడ నగరంలో ఆయుర్వేద డాక్టరు ఇంట్లో చోరీ కేసులో మరో నిందితుడు ప్రకాశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటివరకు ఈ కేసులో నలుగుర్ని అదుపులోకి తీసుకోగా... తాజా అరెస్ట్‌తో నిందితుల సంఖ్య ఐదుకు చేరింది. ప్రకాశ్ నుంచి ఏడు లక్షల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న మరో నిందితుని కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
ఆయుర్వేద వైద్యుని ఇంట్లో చోరీ.. మరో నిందితుడు అరెస్ట్ - in doctor house theft case latest updates
నగరంలో సంచలనం సృష్టించిన ఆయుర్వేద వైద్యుని ఇంట్లో చోరీ కేసులో విజయవాడ పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో మరో నిందితుడు ప్రకాశ్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు... రూ.7 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఆయుర్వేద వైద్యుని ఇంట్లో చోరీ కేసులో మరో నిందితుడు అరెస్ట్