ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక కొరతపై... నవంబర్ 1న విజయవాడలో భారీ బహిరంగ సభ ! - BUILDING_WORKERS

ఇసుక రీచ్​లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ.... నవంబర్ 1వ తేదీన విజయవాడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నామని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు తెలిపారు

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు

By

Published : Oct 23, 2019, 5:40 AM IST

రాష్ట్రంలో ఇసుక రీచ్​లను నిర్వహించడానికి వరదలు అడ్డంకిగా మారాయని ప్రభుత్వం చెప్పడం సాకు మాత్రమేనని... బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు విమర్శించారు. విజయవాడ ప్రెస్​ క్లబ్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ... వరదలు లేని సమయంలో కూడా నూతన పాలసీ పేరుతో ఇసుక సరఫరా నిలిపివేసి వేలాది కార్మికులను రాష్ట్ర ప్రభుత్వం రోడ్డున పడేసిందని మండిపడ్డారు. గడిచిన ఆరు నెలలుగా భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక ఉపాధి కోల్పోయి దుర్భర జీవనాన్ని గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి కోల్పోయిన భవన నిర్మాణ కార్మికులకు 10 వేల రూపాయలు నష్టపరిహారం అందజేయాలన్నారు. ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ అధిక ధరలకు అమ్ముతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. నవంబర్ 1వ తేదీన ఇసుక రీచ్​లను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.

సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు ఉమామహేశ్వరరావు

ABOUT THE AUTHOR

...view details