ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సాయినామ స్మరణతో మార్మోగిన ఆలయాలు

రాష్ట్ర వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఎక్కడికక్కడ సాయిబాబా ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. సాయినామ కీర్తనలతో భక్తులు పరవసించిపోయారు.

సాయిబాబా

By

Published : Jul 16, 2019, 4:03 PM IST

గురు పౌర్ణమి సందర్భంగా కర్నూలు జిల్లాలో సాయిబాబా దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అఖండ సాయి నామ కీర్తనలు చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలో గురుపూర్ణిమ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే బాబా వారికి పాలాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేశారు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో గురు పౌర్ణమి వేడుకలు కనుల పండువగా జరిగాయి. వేలాది మంది భక్తులు బాబాకు పాలాభిషేకం చేసేందుకు తరలి వచ్చారు. కృష్ణా జిల్లా నూజివీడు నియోజకవర్గంలో శ్రీ షిరిడి సాయిబాబాకు పంచామృతాభిషేకం , రుద్రాభిషేకం జరిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలోని శ్రీ బాబా మందిరంలో సద్గురు శ్రీ సాయినాథుని పూజోత్సవాలు కన్నుల పండువగా నిర్వహించారు. విజయనగరం జిల్లాలో సాయి సన్నిదానాల్లో వేకువజాము నుంచే ప్రత్యేక అభిషేకాలు, పూజాది కార్యక్రమాలు చేశారు. దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రలో వివిధ ప్రాంతాల్లో గురుపౌర్ణమి సందర్భంగా అలంకరించిన బాబా ఆలయాలు

ABOUT THE AUTHOR

...view details