కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. 17 లక్షల ఘనపు మీటర్ల మట్టిని తవ్వేందుకు అధికారికంగా 20 లీజులను బినామీ పేర్లతో ప్రజాప్రతినిధులకు అధికారులు కట్టబెట్టడం గమనార్హం. బాపులపాడు, గన్నవరం, విజయవాడ రూరల్ మండలాల్లోని మల్లవల్లి, కొండపావులూరు, పురుషోత్తపట్నం, నున్న పరిసరాల్లో ఈ తవ్వకాలు అధికంగా జరుగుతున్నాయి. ఎటువంటి అనుమతులు తీసుకోకుండానే మరికొందరు స్థానిక పోలవరం కట్టకు ఇరువైపులా తవ్వకాలు జరుపుతున్నా జిల్లా గనుల శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవసరం లేని సమయంలో తవ్వకాలకు అనుమతులివ్వడం ఏంటని ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
పోలవరం కట్టకు ఇరువైపులా.. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు - On both sides of Polavaram embankment .. Arbitrary soil excavations
కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలో యథేచ్ఛగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. పోలవరం కట్టకు ఇరువైపులా తవ్వకాలు జరుపుతున్నా జిల్లా గనుల శాఖ అధికారులు మాత్రం కన్నెత్తి చూడటం లేదు.
పోలవరం కట్టకు ఇరువైపులా.. యథేచ్ఛగా మట్టి తవ్వకాలు