విజయవాడ నగర శివారులో సంచలనం సృష్టించిన వృద్ధురాలు హత్య, దోపిడీ కేసుకు సంబంధించి నగర నేర పరిశోధన పోలీసులు ఓ అనుమానితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఐదు బృందాలుగా విడిపోయి నగర శివారు గ్రామాలు, జిల్లాలోని పలు ప్రాంతాలలో పాత నేరస్ధుల కోసం పోలీసులు జల్లెడ పట్టారు. ఓ పక్క సంఘటన స్ధలానికి దగ్గరలోని సీసీ పుటేజ్ పరిశీలిస్తూనే, పాత సంఘటనలలో నేరస్థులను పట్టుకొని పోలీసులు ప్రశ్నించారు. బండి నెంబర్ ప్లేట్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేశారు. పాత నేరస్థుడి అనుమానించి వాంబేకాలనీ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
వృద్ధురాలి హత్య కేసు: పోలీసుల అదుపులో అనుమానితుడు - విజయవాడ నగర శివారులో వృద్ధురాలి హత్య
కృష్ణా జిల్లాలో వృద్ధురాలు హత్య కేసుకు సంబంధించి పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. వాహనం నెంబర్ ప్లేట్ ఆధారంగా దర్యాప్తు చేశారు.
old women murder case