ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బాలికపై వృద్ధుడు అత్యాచారం... గర్భం దాల్చిన చిన్నారి - విజయవాడలో బాలికపై వృద్ధుడి అత్యాచారం

తాత కామంధుడుగా మారాడు... మనవరాలి వయసున్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని చిరు తిండితో లోబరుచుకుని... గర్భవతిని చేశాడు. ఈ దారుణమైన ఘటన విజయవాడ నగరంలో చోటు చేసుకుంది.

విజయవాడలో బాలికపై వృద్ధుడి అత్యాచారం

By

Published : Oct 15, 2019, 5:01 PM IST

విజయవాడలో జరిగిన అమానుష ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఓ వృద్ధుడు తినుబండారాలతో లోబరుచుకుని బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అజిత్‌సింగ్‌ నగర్‌కు చెందిన అచ్చయ్య కొన్ని రోజుల క్రితం పాఠశాలకు వెళ్లే బాలికను మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కొన్ని రోజులకు బాలిక గర్భం దాల్చింది. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో బాలికపై వృద్ధుడి అత్యాచారం

ABOUT THE AUTHOR

...view details