వివాహేతర సంబంధం... తీసింది వృద్ధుడి ప్రాణం - police
విజయవాడ దేవీనగర్‌లో కొత్తగా నిర్మిస్తున్న బహుళ అంతస్తుల భవనం ముందు నిద్రిస్తున్న రామస్వామి అనే వృద్ధుడు హత్యకు గురైయ్యాడు.
విజయవాడలో వృద్ధుడి హత్య
విజయవాడ దేవీనగర్‌లో కొత్తగా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారు. ఆ ప్రాంతంలో జరిగిన ఓ వృద్దుడి హత్య కలకలం రేపింది. అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న ఓ మహిళతో వివాహేతర సంబంధమే ఈ హత్యకు కారణమని తెలుస్తోంది. తప్పు చేయొద్దని ఆయన్ని ఎన్నిసార్లు హెచ్చరించినా వినిపించుకోలేదని...అందుకే రామస్వామిని హత్య చేశానని వెంకటేశ్వరరావు అనే వ్యక్తి పోలీసులకు లొంగిపోయినట్టు సమాచారం. ఘటనాస్థలికి చేరుకున్న అజిత్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.