ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమార్కులతో కుమ్మకు...అన్నదాత భూమి ఆక్రమణ! - భూఆక్రమణకు వ్యతిరేకంగా గన్నవరం రైతు ఆందోళన

అధికారులే అక్రమార్కులతో కుమ్మక్కై తన భూమిని ఆక్రమిస్తున్నారంటూ.. ఓ వృద్ధరైతు నిరసనకు దిగారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని తన స్థలానికి దొంగ పట్టాలు తయారుచేశారని ఆరోపించారు. అధికారులు అన్యాయం చేస్తే మాకు దిక్కెవరంటూ విలపించారు.

old farmer protesting
భూమి పట్టా చూపుతున్న వృద్ధ రైతు

By

Published : Oct 29, 2020, 4:22 AM IST

వీఆర్వోతో కుమ్మక్కై కొందరు వ్యక్తులు తన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మెట్లపల్లి పోతురాజు అనే వృద్ధ రైతు ఆందోళనకు దిగారు. కృష్ణాజిల్లా గన్నవరం మండలం వీరపనేని గూడెంలోని తన స్థలానికి.. దొంగ పట్టాలు సృష్టించారని ఆరోపించారు. అధికారులే అన్యాయం చేస్తుంటే.. సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని కన్నీటి పర్యంతమయ్యారు.

ఏపీఐఐసీ భూసేకరణలో వచ్చే పరిహారం కోసం అధికారులు ఈ తరహా ఎత్తులు వేస్తున్నట్లు గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఆ వృద్ధ రైతుకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.

ఇదీ చదవండి:ఓవైపు చెట్ల తొలగింపు.. మరోవైపు ఉద్యానవనం

ABOUT THE AUTHOR

...view details