ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెలువోలులో విషాదం... మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య - కృష్ణా జిల్లా నేటి వార్తలు

కృష్ణా జిల్లా వెలువోలు బీసీ కాలనీలో విషాదం నెలకొంది. వయోభారంతో వృద్ధ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

old couple suicide with mentally desoppoint  in veluvolu krishna district
మనస్తాపంతో వృద్ధ దంపతుల ఆత్మహత్య

By

Published : Oct 23, 2020, 10:48 PM IST

కృష్ణా జిల్లా చల్లపల్లి మండలం వెలువోలు బీసీ కాలనీకి చెందిన వృద్ద దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. వేములమడ కృష్ణమూర్తి, లంకమ్మ దంపతులు గత ఎనిమిది సంవత్సరాలుగా వయోభారంతో బాధపడుతున్నారు. వీరికి సంతానం లేకపోవటంతో బంధువులు ఆసరాగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యాయత్నం చేశారు. సమాచారం అందుకున్న బంధువులు మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరూ మృతిచెందారు.

ABOUT THE AUTHOR

...view details