కృష్ణాజిల్లా గుడివాడకు చెందిన కృష్ణమోహన్ రైల్వే శాఖలో ఉద్యోగం చేస్తూ... పదవీ విరమణ పొందారు. తన పదహారేళ్ల వయసు నుంచి ప్రపంచంలో వాడిన పురాతన నాణేలు సేకరించే పనిలో పడ్డారు. క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం వాడిన నాణేలతో పాటు స్వాతంత్రం వచ్చిన తరువాత మనదేశంలో వాడిన నాణాలు సేకరించారు. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం పొందటానికి ప్రయత్నం చేస్తున్నారు. భావితరాలకు పురాతన నాణేల విశిష్టత తెలిపేందుకు ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని కృష్ణమోహన్ తెలిపారు.
'ఇప్పటివే కాదు... ఎప్పటి నాణేలో ఉన్నాయి ఆయన దగ్గర' - కృష్ణమోహన్ నాణేల సేకరణకర్త న్యూస్
ఉద్యోగ విరమణ తర్వాత ఇంట్లో ఖాళీగా ఉండలేదాయన. ఆయనకున్న వ్యాపకంతో పదహారేళ్ల వయసు నుంచే పురాతన నాణేలు సేకరిస్తున్నారు కృష్ణమోహన్.
'ఇప్పటివే కాదు.. ఎప్పటి నాణేలో ఉన్నాయి ఆయన దగ్గర'