తమకు (senior citizens) పింఛన్లు ఇవ్వాలంటూ.. కృష్ణా జిల్లా నాగాయలంకలో వృద్ధులు నిరసన( senior citizens protest for pension at nagayalanka) చేపట్టారు. అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం రోజునే.. ప్రభుత్వం తమను వేదనకు గురి చేస్తోందని వృద్ధులు వాపోయారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. దిక్కూమొక్కూ లేని వృద్ధులకు వివిధ కారణాలను సాకుగా చూపి పింఛన్ ఆపివేయడం సరికాదన్నారు. తమకు పింఛన్లు పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఇచ్చిన హామీ మేరకు పింఛన్(pension to all senior citizens) మొత్తాన్ని పెంచి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.
PROTEST FOR PENSIONS: పింఛన్లు పునరుద్ధరించాలంటూ.. వృద్ధుల నిరసన - పింఛన్ కోసం వృద్ధుల ధర్నా
కృష్ణాజిల్లా నాగాయలంకలో వృద్ధులు నిరసన చేపట్టారు. పింఛన్లు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. వృద్ధులందరికీ పింఛన్(senior citizens protest for pension) ఇవ్వాలన్నారు.

నాగాయలంకలో వృద్ధులు నిరసన
వృద్ధులందరికీ పింఛన్లు ఇవ్వాలంటూ నిరసన