కృష్ణా జిల్లా గన్నవరం వద్ద ఆయిల్ ట్యాంకర్ తో వెళ్తున్న లారీ బోల్తా కొట్టింది. తెల్లవారు జామున ప్రమాదం జరిగింది. ఘటనలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ట్యాంకర్ నుంచి పెట్రోల్, డీజిల్ లీక్ కావటంతో స్థానికులు బకెట్లతో పట్టుకున్నారు. విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద బోల్తా పడటంతో స్థానికుల్లో భయాందోళన చెందారు. దీంతో ట్రాన్స్‌ఫార్మర్ వద్ద నుంచి ట్యాంకర్‌ను అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు దూరంగా తెచ్చారు.
ఆయిల్ ట్యాంకర్ బోల్తా.. ఇద్దరికి గాయాలు - accident at gannavaram
కృష్ణ జిల్లా గన్నవరం వద్ద ఆయిల్ ట్యాంకర్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్, క్లినర్ కి స్వల్ప గాయాలయ్యాయి. ట్యాంకర్ నుంచి పెట్రోల్, డీజిల్ లీక్ కావటంతో స్థానికులు బకెట్లతో పట్టుకున్నారు.

ఆయిల్ ట్యాంకర్ బోల్తా
Last Updated : Jun 28, 2020, 10:27 AM IST