ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరు కానిస్టేబుళ్లు - కృష్ణా జిల్లాలో మద్యం సీసాలు స్వాధీనం

కృష్ణాజిల్లా నందిగామలోని జొన్నలగడ్డ సరిహద్దు వద్ద ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్రంలోని మధిర నుంచి బైక్‌లపై మద్యం తరలిస్తూ ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు.

officials take over liquor bottles from constables in krishna district
ఇద్దరు కానిస్టేబుళ్ల నుంచి 240 మద్యం సీసాలు స్వాధీనం

By

Published : May 25, 2020, 1:06 PM IST

Updated : May 25, 2020, 1:49 PM IST

కృష్ణాజిల్లా నందిగామ డీఎస్పీ రమణమూర్తి ఆధ్వర్యంలో రాష్ట్ర సరిహద్దు జొన్నలగడ్డ చెక్‌పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా.. మద్యం సీసాలతో ఇద్దరు కానిస్టేబుళ్లు పట్టుబడ్డారు. ఒకరు విజయవాడ జీఆర్పీలో డిప్యూటేషన్​లో పనిచేస్తున్న ఏఆర్‌ కానిస్టేబుల్ శివరామకృష్ణగా గుర్తించారు. మరొకరు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్​లో కానిస్టేబుల్ గుంటి నాగేశ్వరరావు అని తెలిపారు.

వీరి వద్ద దాదాపు 400 వందల క్వార్టర్​ బాటిళ్లు, 20 ఫుల్ బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఆంధ్రలో మద్యం అమ్మేందుకు సహకరిస్తున్న తెలంగాణ మద్యం షాపులపై కూడా చర్యలు తీసుకునేలా రిపోర్టు తయారు చేస్తున్నామని... వారిపై చర్యలు తీసుకునేలా చూస్తామని తెలిపారు.

Last Updated : May 25, 2020, 1:49 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details