కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, కోసూరువారిపాలెం గ్రామంలో టమాటాలు కొనేవారు లేక.. పారబోయడంపై ఈటీవీ భారత్ కథనానికి స్పందన లభించింది. మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. ఎంత విస్తీర్ణంలో సాగు చేశారు, కేజీ ధర ఎంత పలుకుతుందనే వివరాలు ఇవ్వమని నివేదిక ఇవ్వమని అగ్రికల్చర్ మార్కెట్ కమిటి అవనిగడ్డ కార్యదర్శి కె. ఆనంద్‌ను సూచించారు. ఎంత మొత్తంలో మార్కెటింగ్ కోసం వెళ్తుందనే వివరాలు, ఏ పట్టణాలకు తీసుకువెళ్తున్నారనే...పూర్తి వివరాలతో నివేదక ఇవ్వమని ఆదేశించారు.
భారత్ కథనానికి స్పందన... టమాటా రేట్లపై అధికారుల ఆరా - latest news on tomato raithulu rates
కృష్ణా జిల్లా మోపిదేవి మండలం, కోసూరువారిపాలెం రైతులు కృష్ణానదిలో టమాటాలు పారబోయడంపై అధికారులు స్పందించారు. మార్కెటింగ్ శాఖ అధికారులు గ్రమస్తులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి టమాటాను మార్కెట్లోకి అనుమతించమని హామీ ఇచ్చారు.
కోసూరువారిపాలెం టమాటా రైతులతో అధికారుల భేటీ
అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ అవనిగడ్డ ఛైర్మన్ కడవకొల్లు నరసింహారావు గ్రామంలో సమావేశం ఏర్పాటుచేసి రైతులతో మాట్లాడారు. బయట ప్రాంతాల నుంచి టమాటా దిగుమతి కావడంతో.. ఈ ప్రాంతం టమాటాలపై మొగ్గుచూపడంలో లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు విషయం ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. రైతులు నష్ట పోకుండా వెంటనే తగుచర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కోల్డు స్టోరేజ్‌ల నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు.
ఇదీ చదవండి :కొనేవాళ్లు లేక టమాటా గంగపాలు