ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సీజన్‌ వ్యాధులు.. ముందు ముందు మరిన్ని సమస్యలు! - awareness on seasonal diseases in ap

కరోనా ఆందోళనలో ఉన్న రాష్ట్ర ప్రజలను వర్షాకాలం తీసుకొచ్చే సీజనల్‌ వ్యాధులు మరింత భయపెట్టనున్నాయి. జ్వరం వస్తే చాలు కరోనా సోకిందేమోనని అందరూ కంగారు పడుతున్న తరుణంలో డెంగీ, మలేరియా లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది. సీజనల్‌ వ్యాధుల కట్టడి చర్యలపై దృష్టి సారించింది.

సీజన్‌ వ్యాధుల కట్టడిపై దృష్టిసారించిన అధికారులు
సీజన్‌ వ్యాధుల కట్టడిపై దృష్టిసారించిన అధికారులు

By

Published : May 28, 2020, 2:31 PM IST

సీజన్‌ వ్యాధుల కట్టడిపై దృష్టిసారించిన అధికారులు

ఇప్పటికే ప్రజలను భయపెడుతున్న కరోనాకు మలేరియా, డెంగీ, స్వైన్‌ఫ్లూ వంటివి తోడైతే పరిస్థితి మరింత తీవ్రరూపం దాల్చుతుంది. జూన్‌లో ప్రారంభమయ్యే వర్షాకాలంలో మలేరియా, డెంగీ జ్వరాలతోపాటు స్వైన్‌ఫ్లూ, చికున్ గన్యా, టైఫాయిడ్‌, కామెర్లు, డయేరియా వంటి వ్యాధుల వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయి. కొన్ని వ్యాధులకు దగ్గు, జలుబు, జ్వరం వంటి ఫ్లూ లక్షణాలు కనిపిస్తాయి. కొవిడ్‌కూ ఇవే లక్షణాలు ఉండటంతో తమకు వచ్చింది కరోనానో, మలేరియానో తెలియక ప్రజలు కంగారుపడే అవకాశముంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన వైద్యశాఖ అధికారులు వ్యాధుల వ్యాప్తి కట్టడిపై దృష్టి సారించారు.

తొలుత జ్వరాల నియంత్రణపై దృష్టి పెట్టిన అధికారులు ఆరోగ్య కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేసేలా చర్యలు ప్రారంభించారు. గతేడాది డెంగీ, మలేరియా జ్వరాలు ఎక్కువగా నమోదైన ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తాగునీరు కలుషితం కాకుండా పంచాయతీ, పురపాలక సిబ్బంది పైపులైన్ల మరమ్మతు పనులు చేపట్టనున్నారు.

సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటింటి సర్వే ద్వారా కొవిడ్‌తోపాటు సీజనల్‌ వ్యాధుల లక్షణాలపైనా అవగాహన కల్పించనున్నారు. కరోనాకు, డెంగీకి లక్షణాల్లో మార్పులు ఉన్నాయని విజయవాడ మున్సిపల్‌ ప్రధాన వైద్యాధికారి చెబుతున్నారు. జ్వరం సంయుక్త లక్షణమైన జలుబు, దగ్గు, గొంతునొప్పి కరోనాకూ ఉన్నాయని గుర్తుచేస్తున్నారు.

సీజనల్‌ వ్యాధుల వ్యాప్తికి దోమలు ప్రధాన కారణమని, వాటి వృద్ధి కట్టడిపై దృష్టి పెడతామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇళ్లలో నీటిని నిల్వ ఉంచొద్దని ప్రజలకు సూచిస్తున్నారు. జ్వర లక్షణాలతో ఆసుపత్రికి వచ్చేవారికి వైద్యం అందించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

ఇవీ చదవండి:

'కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?'

ABOUT THE AUTHOR

...view details