ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ప్రభుత్వ కార్యాలయాల్లో తెలుగు అమలు చేయకుంటే చర్యలు' - machilipatnam latest news

అన్నీ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష తెలుగును అమలు చేయకుంటే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని రాష్ట్ర అధికారభాషా సంఘం అధ్యక్షుడు హెచ్చరించారు. కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్​లోని సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Official Language Association Review Meeting
రాష్ట్ర అధికార భాషా సంఘం సమీక్షా సమావేశం

By

Published : Nov 18, 2020, 3:30 PM IST

కృష్ణాజిల్లా మచిలీపట్నం కలెక్టరేట్​ కార్యాలయంలో రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ సమీక్ష నిర్వహించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అధికార భాష తెలుగును అమలు చేయాలని... లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఆయా విభాగాల్లో పాలనాపరంగా భాష అమలవుతున్న తీరును యార్లగడ్డ సమీక్షించారు. తెలుగు బాషా గొప్పతనాన్ని.. దాని వాడుక అవసరాన్ని ఆయన వివరించారు. అధికార బాష అమలుపై నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తామని స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులతోపాటు జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, వివిధ శాఖలకు సంబంధించిన ఉద్యోగులు పాల్గొన్నారు.

"జగన్​ ముఖ్యమంత్రిగా భాద్యతలు స్వీకరించిన మూడు నెలల్లోనే అధికార భాషాసంఘాన్ని నియమించారు. పాలనాపరమైన విధానాల్లో తెలుగు భాషను ఉపయోగించటంలో ముందుడాలని సూచించారు. అందులో భాగంగానే రాయలసీమ నాలుగు జిల్లాలు మినహా అన్ని జిల్లాల్లో మా సంఘం పర్యటించింది. అధికార భాషాసంఘం లక్ష్యాలు, ఉద్దేశాలు, నియమాలు అధికారులకు వివరించాం. వారు ఏ విధంగా పనిచేయాలో .. చేస్తున్న పనిని ఎలా పెంపొందించాలో సూచించాం"

-యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, రాష్ట్ర అధికార సంఘం అధ్యక్షుడు

ఇదీ చదవండి:గవర్నర్‌తో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్ సమావేశం

ABOUT THE AUTHOR

...view details