కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పోలీసు ప్రధాన కార్యాలయం వద్ద 7 పోలీసు జాగిలాల పనితీరును ఇంటెలిజెన్స్ డాగ్ స్క్వాడ్ ఆర్ఐ శ్రీనివాసులు బుధవారం పరిశీలించారు. జాగిలాల పనితీరు, వాటి సంరక్షణ, కెనాల్ నిర్వహణ వంటి అంశాలను తనిఖీ చేశారు. పేలుడు పదార్థాలను గుర్తించడం, నేర స్థలంలో వస్తువులను పసిగట్టటం, వాటి ఆధారంగా నేరస్థులను గుర్తించటంపై జాగిలాలకు పరీక్షలు నిర్వహించారు సిబ్బంది. ఇందులో అన్ని జాగిలాలు చక్కటి ప్రతిభ కనబరిచాయని, వాటి పనితీరు బాగుందని ఇంటెలిజెన్స్ డాగ్ స్వాడ్ ఆర్ఐ శ్రీనివాసులు తెలిపారు.
పోలీసు జాగిలాల పనితీరును పరిశీలించిన అధికారులు
పోలీసు జాగిలాలకు మచిలీపట్నంలో పరీక్షలు జరిగాయి. పేలుడు పదార్థాలను గుర్తించటం, నేర స్థలంలోని ఆధారాలను పసిగట్టటం వంటి అంశాలపై వాటి పనితీరును పరిశీలించారు పోలీసులు.
police dogs