ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మద్యం సేవిస్తూ అధికారులు మీడియాకు అడ్డంగా చిక్కారు. నూజివీడు పంచాయతీరాజ్ కార్యాలయ విశ్రాంతి భవనాన్ని... అసాంఘిక కార్యాకలపాలకు డివిజనల్ పంచాయతీ రాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ , సాంఘీక సంక్షేమ శాఖ ఈఈ వినియోగించారు. కాంట్రాక్టర్లతో కుమ్మకై ప్రభుత్వ గెస్ట్ హౌస్‌లో మద్యం సేవిస్తూ చిందులేశారు. విశ్రాంతి భవనంను విలాసభవనంగా మార్చి ప్రభుత్వ అధికారులు మత్తులో జోగారు. నూజివీడు పంచాయతీ రాజ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్ శాఖలకు చెందిన అతిథిగృహాన్ని రెస్టారెంట్ గా మార్చేస్తున్నారు.
ప్రభుత్వ అతిథిగృహంలో మద్యం సేవించి.. అధికారుల చిందులు - krishna district latest news
కృష్ణా జిల్లా నూజివీడు ప్రభుత్వ అతిథిగృహంలో అధికారుల మద్యం సేవించి.. చిందులు వేశారు. గుత్తేదారులతో కలిసి చిందులేస్తూ.. మీడియాకు చిక్కారు.
liquor
Last Updated : Mar 17, 2022, 5:46 AM IST