ప్రభుత్వ ఆదేశాలతో తిరిగి మద్యం దుకాణాలు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మద్యం అమ్మకాలను నిలిపివేయాలంటూ మహిళలు అడ్డుకుంటున్నారు. కృష్ణా జిల్లా పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామంలో ఉన్నా ప్రభుత్వ మద్యం దుకాణాన్ని తెరిచేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా స్థానిక మహిళలు అడ్డుకున్నారు.
దుకాణం తెరవడానికి వీల్లేదంటూ డిమాండ్ చేశారు. చుట్టు పక్కల గ్రామాల వారు ఇక్కడకు వస్తే కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన చేపట్టారు. అనంతరం పోలీసులు మద్యం దుకాణాన్ని మూసివేశారు.