కృష్ణా జిల్లాలో గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలను అధికారులు మరింత కట్టుదిట్టం చేశారు. తెలంగాణ నుంచి అనుమతులతో వచ్చే వాహనాల్లో సైతం వైద్యపరమైన అత్యవసరమైన వాటినే అనుమతిస్తూ మిగిలిన వాటిని వెనక్కి పంపుతున్నారు. నిబంధనలు అతిక్రమించిన వారి వాహనాలపై 'R' అనే అక్షరంతో గుర్తు వేస్తున్నారు. తెలంగాణ నుంచి గుంటూరు వైపు వెళ్లే వాహనాలను విజయవాడ వైపు మళ్లించడంతో ఇక్కడ వాహనాల రద్దీ మరింత పెరుగింది.
గరికపాడు చెక్‌పోస్టు వద్ద అధికారుల తనిఖీలు - garikapadu chekpost news
కృష్ణా జిల్లా జాతీయ రహదారిలో గరికపాడు చెక్‌పోస్టు వద్ద అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. అత్యవసరమైన వాటిని మాత్రమే అనుమతిస్తూ... మిగిలిన వాటిని నిలిపివేస్తున్నారు.

గరికపాడు చెక్‌పోస్టు వద్ద అధికారుల తనిఖీలు