పులిచింతల నుంచి విడుదలైన కృష్ణా జలాల ఉద్ధృతి కొనసాగుతోంది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ముక్త్యాల, వేదాద్రి, రావిరాల తదితర గ్రామాల్లోని పరివాహక ప్రాంతాలను ముంచుతోంది. ఇప్పటికే పలు గ్రామాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. కలెక్టర్ ఆదేశాలతో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
కృష్ణమ్మకి వరద తాకిడి...అధికారులు అప్రమత్తత - కృష్ణా జలాలు
కృష్ణమ్మ ఉరకలేస్తూ ప్రవహించటంతో... కృష్ణా జిల్లాలోని పలు గ్రామాలు నీటి మునిగాయి. అప్రమత్తమైన అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.
కృష్ణమ్మకి వరద తాకిడి...అధికారులు అప్రమత్తత