ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రక్షిత కూరగాయల సాగుపై మోపిదేవిలో ఒడిశా బృదం పర్యటన - మోపిదేవి మండలం తాజా వార్తలు

కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో పాలిహౌస్, షెడ్ నెట్​ల ద్వారా రక్షిత సాగు పద్ధతిలో కూరగాయలు సాగు చేస్తున్న తీరును ఒడిశా నుంచి వచ్చిన ఉద్యానశాఖ అధికారులు పరిశీలించారు. సాగు విధానాలు, ఇతర పద్ధతులు ఉద్యాన శాఖ అధికారులు ఒడిశా బృందానికి వివరించారు.

odisha officers visited vegetable production in krishna district
కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో ఒడిశా బృందం పర్యటన

By

Published : Mar 27, 2021, 4:47 PM IST

పాలిహౌస్, షెడ్ నెట్​లలో పండించే కూరగాయల రక్షిత సాగు పద్ధతులపై ఒడిశా నుంచి వచ్చిన ఉద్యానశాఖ అధికారులు కృష్ణాజిల్లా మోపిదేవి మండలంలో కూరగాయల సాగును పరిశీలించారు. మండలంలోని పలు గ్రామాల్లో సాగు చేస్తున్న కీరదోస పంటల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. రైతు యక్కటి హనుమాన్ ప్రసాద్ షెడ్​నెట్​లో రెండు ఎకరాల్లో రెండు సంవత్సరాలుగా కీర దోస, నారుమడులు పెంపకం ఇతర సాగు విధానాలను అధికారులు వారికి వివరించారు.

కృష్ణాజిల్లా, ఉద్యాన శాఖ అధికారి డి. దయాకర బాబు ఒడిశా బృందానికి సాగు పద్ధతులు గూర్చి తెలియజేశారు. ఒడిశా బృందం అధికారుల వెంట అవనిగడ్డ ఉద్యానశాఖ అధికారి జి. లకపతి, రైతు భరోసా కార్యాలయ సిబ్బంది, రైతులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details