ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Ocugen Pharma Company: 'కొవాగ్జిన్‌' మార్కెటింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న ఆక్యుజెన్‌ - Ocugen-pharma-company-owns-the-marketing-rights-of-covaxin

భారత్‌ బయోటెక్‌కు చెందిన 'కొవాగ్జిన్‌' మార్కెటింగ్‌ హక్కులను కెనడాకు చెందిన ఫార్మా కంపెనీ ఆక్యుజెన్‌ దక్కించుకుంది. వ్యాక్సిన్‌ తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్‌ హక్కులను ఆక్యుజెన్‌కు బీబీ బదలాయించింది. తద్వారా వ్యాక్సిన్‌ అమ్మకాల్లో 45 శాతం వాటాలు ఆక్యుజెన్‌కు సొంతం కానున్నాయి.

Ocugen Pharma Company : 'కొవాగ్జిన్‌' మార్కెటింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న ఆక్యుజెన్‌
Ocugen Pharma Company : 'కొవాగ్జిన్‌' మార్కెటింగ్‌ హక్కులను సొంతం చేసుకున్న ఆక్యుజెన్‌

By

Published : Jun 3, 2021, 9:06 PM IST

కెనడాకు చెందిన ప్రముఖ బయో ఫార్మా కంపెనీ ఆక్యుజెన్ ఇంక్‌.. ఆ దేశంలో 'కొవాగ్జిన్' (covaxin) మార్కెటింగ్ హక్కులను సొంతం చేసుకుంది. దీనిపై కొవాగ్జిన్‌ టీకాను అభివృద్ధి చేసిన భారత్ బయోటెక్‌ (bharat biotech)తో ఆక్యుజెన్‌ ఒప్పందం కుదుర్చుకుంది. వ్యాక్సిన్ అభివృద్ధి, కంటివ్యాధుల నిర్మూలన, జీన్ థెరపీ వంటి విభాగాల్లో ఆక్యుజెన్ ప్రసిద్ధి చెందింది. ఒప్పందంలో భాగంగా కెనడాలో కొవాగ్జిన్ తయారీ, అభివృద్ధి, మార్కెటింగ్ హక్కులను భారత్ బయోటెక్.. ఆక్యుజెన్‌కు బదలాయించింది. తద్వారా వ్యాక్సిన్ అమ్మకాల్లో 45 శాతం లాభాల వాటాను ఆక్యుజెన్ దక్కించుకోనుంది.

అగ్రరాజ్య మార్కెట్​లోనూ కొవాగ్జిన్..

కెనడాకు చెందిన ఈ కంపెనీ యూఎస్ విపణిలోనూ వాణిజ్యీకరణ హక్కులను కలిగి ఉంది. తద్వారా అగ్రరాజ్య మార్కెట్‌లోనూ కొవాగ్జిన్ ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇప్పటికే 13కు పైగా దేశాల్లో వినియోగం, 60కు పైగా దేశాల్లో అనుమతుల ప్రక్రియలో ఉన్న కొవాగ్జిన్‌ను మరిన్ని దేశాలకు విస్తరించేందుకు తమ ఒప్పందం దోహదపడుతుందని ఆక్యుజెన్‌ ఆశాభావం వ్యక్తం చేసింది.

ఇదీ చదవండి:TPCC Uttam: ప్రతి కార్యకర్త కుటుంబాన్ని ఆదుకుంటాం: ఉత్తమ్​

ABOUT THE AUTHOR

...view details