ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు ఇండోర్​ స్టేడియం కల నెరవేరేనా..?

కృష్ణా జిల్లా నూజివీడు.. మామిడి తోటలకే కాదు ఎంతో మంది ప్రతిభావంతులైన క్రీడాకారులకు నెలవు. ఈ ప్రాంతం నుంచి చాలా మంది రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎంపికై పతకాలు సాధించారు. ఇక్కడ క్రీడాకారులను మరింత ప్రోత్సహించేలా ఇండోర్​ స్టేడియం నిర్మాణం చేపట్టాలని ప్రజా ప్రతినిధులు భావించారు. అయితే గత కొన్నేళ్లుగా స్టేడియం నిర్మాణ పనులు ఆగిపోయి క్రీడాకారుల కల కలగానే మిగిలిపోయింది.

నూజివీడు ఇండోర్​ స్టేడియం కల నెరవేరేనా..?
నూజివీడు ఇండోర్​ స్టేడియం కల నెరవేరేనా..?

By

Published : Dec 22, 2019, 4:40 PM IST

Updated : Dec 22, 2019, 5:09 PM IST

ఇండోర్​ స్టేడియం కల నేరవేరేనా..?
కృష్ణా జిల్లా నూజివీడులో ఇండోర్​ స్టేడియం కల కలగానే మిగిలిపోతోంది. ఇక్కడ ఇండోర్​, అవుట్​ డోర్​ స్టేడియం కోసం మూడుసార్లు స్థలాన్ని కేటాయించారు. మొదట ఊరి మధ్యలో మూడెకరాలు స్థలాన్ని ఇవ్వగా వివాదాల వల్ల మార్చాల్సి వచ్చింది. అనంతరం జనార్దన్​ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మరో స్థలాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు కోటి రూపాయల నిధులు కేటాయించారు. అయితే నిర్మాణ పనులు చేపట్టి అది పూర్తి కాకుండానే సగంలోనే వదిలేశారు. ఇప్పుడు అక్కడ సంచార జాతులు నివాసం ఉంటున్నారు.

చివరి ప్రయత్నమూ ఫలించలేదు

ఇండోర్​ స్టేడియం నిర్మాణానికి చివరి ప్రయత్నంగా 2006లో నూజివీడులో తిరువూరు రోడ్డు మార్గంలో స్థలాన్ని కేటాయించారు. అయితే ఇది ఓ ప్రముఖ నటుడికి చెందిన స్థలం కావడం వల్ల అభ్యంతరాలు వచ్చాయి. ఇది కూడా అర్ధంతరంగా నిలిచిపోయింది. స్టేడియం నిర్మాణంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని ఉన్నతాధికారులు, ప్రభుత్వం స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని క్రీడాకారులు కోరుతున్నారు.

ప్రతిభను ప్రోత్సహించండి

నూజివీడు నుంచి ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ పడి అనేక పతకాలు కైవసం చేసుకున్నారు. క్రీడల కోటా కింద ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. 1970 - 80 మధ్యలో నూజివీడు నుంచి రాష్ట్ర జాతీయ స్థాయి పతకాలు పొందిన చాలా మంది ఇదే ప్రాంతంలో స్థిరపడ్డారు. మధ్యలో నిలిచిపోయిన స్టేడియం పనులు పూర్తి చేసి క్రీడాకారులకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

దక్షిణాఫ్రికాతో పోలిక సరైనదేనా..? ప్రభుత్వ చర్యలతో ప్రగతి ఎంత నిజం?

Last Updated : Dec 22, 2019, 5:09 PM IST

ABOUT THE AUTHOR

...view details