కృష్ణా జిల్లా నూజివీడు పట్టణంలోని పోతిరెడ్డిపల్లి బైపాస్ క్రాస్ రోడ్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా తెలంగాణ నుంచి 336మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. ఒకరిని అరెస్టు చేశారు. ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రూ.80వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు.
336 సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం - నూజివీడు వార్తలు
తెలంగాణ నుంచి ఏపీకి నిత్యం అక్రమంగా మందుబాబులు మద్యం తరలిస్తున్నారు. తాజాగా కృష్ణాజిల్లా నూజివీడులో పోలీసులు తనిఖీలు చేస్తుండగా 336మద్యం సీసాలను పట్టుకున్నారు.
336 సీసాల తెలంగాణ మద్యం స్వాధీనం