ఇన్నోవేటివ్ ఏఫ్జీఏ ఆన్లైన్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బంగారు పతకం సాధించారు. వారు తయారుచేసిన 'అటానమస్ కారు' పసిడి పతకం, లక్ష రూపాయల నగదు గెలుచుకుంది. త్వరలో చైనాలో జరగబోయే పోటీల్లో ఈ విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ పోటీలను ఇంటెల్ టెర్రసిక్ డీజీ క్యూట్ సంస్థలు నిర్వహించాయి. కళాశాలలో ఈసీఈ చివరి సంవత్సం చదువుతున్న సమీర్, నాగరాజు, జాన్పాల్ ఈ కారు తయారుచేశారు. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 4 జట్లు పోటీపడగా వారందర్నీ వెనక్కినెట్టి 'అటానమస్ కారు' మొదటి బహుమతి సొంతం చేసుకుంది. డ్రైవర్ లేకుండా వెళ్లడం తమ కారు ప్రత్యేకత అనీ.. అధ్యాపకుల ప్రోత్సాహంతోనే దీని తయారీ సాధ్యమైందని విద్యార్థులు చెప్పారు. చైనాలో జరిగే పోటీల్లోనూ సత్తా చాటుతామని విశ్వాసం వ్యక్తంచేశారు.
పసిడి గెలుచుకున్న 'అటానమస్ కారు' - అటానమస్ కారు తయారు చేసిన నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థులు
ఇన్నోవేటివ్ ఏఫ్జీఏ ఆన్లైన్లో నిర్వహించిన అంతర్జాతీయ పోటీల్లో కృష్ణా జిల్లా ట్రిపుల్ ఐటీ విద్యార్థులు బంగారు పతకం సాధించారు. త్వరలో చైనాలో జరగబోయే పోటీల్లో వీరు రూపొందించిన అటానమస్ కారుతో పోటీలో పాల్గొననున్నారు.
నూజివీడు త్రిబుల్ ఐటీ విద్యార్థుల ఘనత