ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నూజివీడు సబ్ కలెక్టర్ అంతర్రాష్ట్ర బదిలీ - నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ఠ మంగైన్ ఛత్తీస్​గఢ్ క్యాడర్​కు బదిలీ

నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ఠ మంగైన్ ఛత్తీస్​గఢ్ క్యాడర్​కు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. 2020 ఆగస్ట్‌ 17న నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు.

నూజివీడు సబ్ కలెక్టర్ బదిలీ
నూజివీడు సబ్ కలెక్టర్ బదిలీ

By

Published : Jun 23, 2021, 1:38 PM IST

నూజివీడు సబ్‌ కలెక్టర్‌ ప్రతిష్ఠ మంగైన్‌ స్వీయ అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌ నుంచి ఛత్తీస్‌గఢ్‌ క్యాడర్‌కు బదిలీ అయ్యారు. ఆమెను రాష్ట్ర సర్వీసుల నుంచి రిలీవ్‌ చేస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆమె 2018 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్‌ అధికారిణి. ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన ఆమె తల్లిదండ్రులు దిల్లీలో స్థిరపడ్డారు. సివిల్స్‌లో జాతీయ స్థాయిలో 55వ ర్యాంక్‌ సాధించి.. తొలుత విశాఖపట్నంలో శిక్షణ కలెక్టర్‌గా పనిచేశారు. 2020 ఆగస్ట్‌ 17న నూజివీడు సబ్‌ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పంచాయతీ, మున్సిపల్, జిల్లా పరిషత్‌ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించారు. డివిజన్‌లో కరోనా నియంత్రణ, కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటుకు కృషి చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలు కొనసాగించి డివిజన్‌ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారు. ఆమె ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 2018 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి సంబిత్‌ మిశ్రాను వివాహం చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details