ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మనస్థాపంతో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - undefined

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ప్రథమ సంవత్సరం చదువుతున్న దివ్వ..ఆమె స్వగ్రామానికి చెందిన యువకుడుతో ఫేస్​బుక్ పరిచయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న ఆమె తలిదండ్రులు మందలించారు. మనస్థాపం చెందిన ఆమె శుక్రవారం సాయంత్రం ఆత్మహత్యయత్నానికిి పాల్పడింది.

మనస్థాపంతో నూజివీడు ట్రిపుల్​ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

By

Published : May 4, 2019, 1:03 PM IST

మనస్థాపంతో నూజివీడు ట్రిపుల్​ఐటీ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్‌ఐటీ విద్యార్థిని నిన్న ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కడప జిల్లా పెండ్లిమర్రి మండలం, తిప్పరాజిపల్లికి చెందిన అంబటి దివ్య నూజివీడు ట్రిపుల్‌ఐటీలో ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఆమెకు స్వగ్రామానికి చెందిన యువకుడు ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు. తర్వాత అతని ప్రవర్తన నచ్చక ఫేస్‌బుక్‌ ఖాతాను బ్లాక్‌లిస్టులో పెట్టింది. ఈ విషయంపై సదరు యువకుడు దివ్య తల్లిదండ్రులకు చెప్పాడు. చదువుకోకుండా ఇలాంటి చేష్టలేంటని ఆమెను కన్నవారు మందలించారు. ఈ ఘటనలతో తీవ్ర మనస్థాపం చెందిన దివ్య... తలరంగు రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తోటి విద్యార్థులు, సంరక్షులు గమనించి ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆ యువతి బలవన్మరణానికి పాల్పడిందని... కళాశాల వైపు నుంచి ఎలాంటి తప్పులేదని అధికారులు స్పష్టం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details