ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులపై ఎన్టీఆర్ వర్సిటీ చర్యలు - ఎన్టీఆర్ యూనివర్సిటీ వార్తలు

వైద్య పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్థులపై ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు చర్యలకు రంగం సిద్ధం చేశారు. విజయవాడలో కాటూరి మెడికల్ కళాశాలలో ఈ ఘటన జరిగింది.

NTR University actions  on students copyied in medico exams
ఎన్టీఆర్ వర్సిటీ

By

Published : Nov 25, 2020, 10:17 PM IST

కాటూరి మెడికల్ కళాశాలలో వైద్య పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డ విద్యార్ధులపై ఎన్టీఆర్ వర్సిటీ అధికారులు చర్యలు చేపట్టనున్నారు. రెండు విడతలుగా మొత్తం 14 మంది విద్యార్థులు ... తాజాగా జరిగిన సప్లిమెంటరీ పరీక్షల్లో కాపీయింగ్ చేస్తూ పట్టుబడ్డారు. మొదట ఏడుగురు విద్యార్థులు స్క్వాడ్​కు దొరికారు. వారిపై అధికారులు కమిటీ వేయగా.. విద్యార్థులపై చర్యలు తీసుకునేందుకు ఆ కమిటీ సిద్ధమైంది. ఏడాది పాటు డీబార్ చేసేందుకు చర్యలు చేపట్టునున్నట్లు సమాచారం. రెండో సారి పట్టుబడిన ఏడుగురు విద్యార్ధులపై చర్యలు తీసుకునేందుకు కమిటీ మరోసారి తాజాగా సమావేశమైంది. వీరిపై కూడా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. త్వరలోనే వారిపై చర్యలు తీసుకోనున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details