కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాజీమంత్రి దేవినేని ఉమా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అభిమానులు, పార్టీ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి పంచారు. నటుడిగా ఎన్టీఆర్ ఎటువంటి పాత్రలోనైనా ఒదిగిపోయేవారని ప్రశంసించారు.
కృష్ణా జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు - devineni uma said tdp comes to power again
కృష్ణా జిల్లా మైలవరంలో ఎన్టీఆర్ 97వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
కృష్ణా జిల్లాలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు
సోషల్ మీడియాలో పోస్టులపై ప్రభుత్వం కక్షపూరిత ధోరణితో కేసులు పెట్టించి దాడులు చేస్తోందని ఆరోపించారు. డాక్టర్ సుధాకర్‌పై పిచ్చివాడనే ముద్ర వేసి ఆసుపత్రి పాలు చేశారన్నారు. రాబోయే రోజుల్లో చంద్రబాబు కృషితో, ఎన్టీఆర్ స్పూర్తితో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు ధీమా వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: రెండో రోజు ఘనంగా ప్రారంభమైన పసుపు పండుగ