Eenadu Auto Expo: వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా.. కంపెనీల డీలర్లను, కార్ల డీలర్లను..."ఈనాడు"సంస్థ ఒకే వేదికపైకి తీసుకురావడాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు అభినందించారు. విజయవాడలోని...సిద్ధార్థ కళాశాల ప్రాంగణంలో రెండు రోజుల పాటు జరిగే ఈనాడు ఆటో ఎక్స్‌పో ను కలెక్టర్ ప్రారంభించారు. అన్ని కంపెనీలకు సంబంధించిన వాహనాలను 30 స్టాళ్లల్లో ప్రదర్శనకు ఉంచారు.
అన్నిరకాల వాహనాలను ఒకే వేదికపైకి తీసుకురావడం అభినందనీయం: ఢిల్లీరావు - NTR District Collector Delhi Rao
Eenadu Auto Expo: మారుతున్న కాలంతోపాటు వాతావరణ స్థితిగతులను పరిగణనలోకి తీసుకుని కాలుష్య రహిత వాహనాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వాహనాల వైపు వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు అభిప్రాయపడ్డారు. కాలుష్య రహిత హరిత వాహనాలను అభివృద్ది చేసేందుకు అనేక కంపెనీలు పోటీ పడుతున్నాయని అన్నారు. విజయవాడలోని సిద్ధార్థ హోటల్ మేనేజ్‌మెంట్ కళాశాల ప్రాంగణంలో ‘ఈనాడు’ ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు జరిగే ‘ఈనాడు ఆటో ఎక్స్‌పో ను కలెక్టరు ముఖ్య అతిథిగా లాంఛనంగా ప్రారంభించారు. ద్విచక్రవాహనాల కంపెనీల డీలర్లను, కార్ల డీలర్లను ఒకే వేదికపైకి తీసుకురావడంలో ‘ఈనాడు’ సంస్థ విజయవంతమైందని కలెక్టర్ అభినందించారు.
ఈనాడు ఆటో ఎక్సపో
ఆటో ఎక్స్‌పో ప్రదర్శనకు వచ్చే సందర్శకులకు లక్కీడ్రా ద్వారా బహుమతులు అందిస్తున్నారు.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజరు కె.రంగరాజన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా డీజీఎం రజనీకాంతరావుతో పాటు వివిధ వాహన కంపెనీలకు చెందిన ప్రముఖులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: